చీటింగ్‌లో పీ.హెచ్.డి తీసుకున్న నాయకుడతను….
మోసం చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడు పట్టభద్రుడని మాజీ సీఎం వైఎస్ జగన్ ఎద్దేశా చేశారు.గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తెచ్చిన రూ. 1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయని సూటిగా ప్రశ్నించారు..ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారని మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అని చెప్పి.. ఉన్న పీఆర్సీ ఛైర్మన్ ను పంపించేశారని విమర్శించారు. ఏ నెలలో ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఆర్థిక విధ్వంసమని .. తమ హయాంలో 4 పోర్టులు .. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించి ఆర్దిక పరిపుష్టి సాగించామని చెప్పారు.