కోహ్లి రిటైర్‌మెంట్‌కు అసలు కారణం..
విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించి క్రీడాభిమానులను చాలా నిరాశపరిచారు. అయితే ఆయన అభిమానులకు ఆయన ఎందుకు సడెన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు. రన్‌మెషిన్‌గా పేరు గడించి, మైదానంలో పరుగుల వరద పారిస్తూ ప్రపంచంలోనే ఫిట్‌గా ఉండే బ్యాట్స్‌మెన్‌గా పేరు తెచ్చుకున్నారు కోహ్లి. కేవలం 36 ఏళ్లకే ఎందుకు రిటైర్ మెంట్ తీసుకున్నారని పలు ప్రశ్నలు తలెత్తాయి. దీనితో విశ్లేషకులు కోహ్లి నిర్ణయానికి కారణాలను ఇలా చెప్తున్నారు. కరోనా తర్వాత కోహ్లి ఫామ్ కోల్పోయారని, టెస్టుల్లో యావరేజ్ స్కోర్ 55 నుండి 46కు పడిపోయిందని కోహ్లి నిరుత్సాహపడ్డారు. అలాగే మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. న్యూజిలాండ్ సిరీస్‌లో బీజీటీలో కూడా రాణించకపోవడంతో ఆయన క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత క్రికెట్‌లో సచిన్, ధోనీలను మరిపించేలా అద్భుత విజయాలను అందించిన కోహ్లి రిటైర్‌మెంట్ ప్రకటించడం అందరినీ నిరుత్సాహపరిచింది.

