ఈ ఘటన 140 కోట్లమంది భారతీయులను సిగ్గుపడేలా చేసింది
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్లమంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని ప్రధానిమోదీ వ్యాఖ్యానించారు. ఇలాంటి అమానవీయ పనులు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు. ఆ నిందుతులను కఠినంగా శిక్షిస్తామని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నానని హామీ ఇచ్చారు. ఈఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. వారు తగిన చర్యలు చేపట్టకపోతే తామే ముందడుగు వేయాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ హెచ్చరించారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ప్లీజ్ సేవ్ మణిపూర్’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. స్త్రీల ప్రైవేట్ భాగాలపై చేతులు వేసిన వారిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని కోరుతున్నారు. రాష్ట్రప్రభుత్వంపై, కేంద్రప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.