Andhra PradeshHome Page Slider

బిచ్చగాళ్లకు హోటల్ భోజనం పెట్టిన బిచ్చగాడు హీరో..ఎక్కడంటే

బిచ్చగాడు సినిమా ఎంత సన్సేషనల్ హిట్ అయ్యిందో మనందరకూ తెలుసు. ఇప్పుడు బిచ్చగాడు -2 కూడా అంతే హిట్ అవుతోంది. దీనితో హీరో విజయ్ అంథోనీ చాలా ఖుషీగా ఉన్నారు. రాజమండ్రిలో సందడి చేస్తూ బిచ్చగాళ్లకు గొప్ప సహాయం చేసి, తన మంచి మనసు చాటుకున్నారు ఈ హీరో. బిచ్చగాళ్లు ఎన్నడూ చూడలేని మంచి హోటల్‌కు తీసుకెళ్లి వాళ్లకు భోజనం పెట్టించారు. అంతేకాదు, స్వయంగా వారికి భోజనం వడ్డించారు. వాళ్ల కళ్లలో ఆనందం చూసి ఎంతో సంబరపడ్డారు విజయ్. తాను చాలా పేద కుటుంబం నుండి వచ్చానని, వారి కష్టాలు తనకు తెలుసని పేర్కొన్నారు. వారి జీవితాలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటాయని, అందుకే వారికి ఎంతో కొంత సంతోషం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసానని చెప్పారు విజయ్. గతంలో కూడా కొందరు బిచ్చగాళ్లకు బిచ్చగాడు కిట్‌ను అందజేసారు. వాటిలో వారికి కావలసిన కొంత సామాగ్రిని పెట్టి అందజేశారు. ఏదైమైనా ఇలాంటి మంచి మనసు ఉన్న హీరోలు అరుదు కదా. తన ఈ సినిమాను ఆదరించినందుకు  చాలా సంతోషంగా ఉందని, బిచ్చగాడు 3 సినిమాను కూడా త్వరలోనే తెరకెక్కిస్తానని అంటున్నారు.