డాన్స్ చేస్తూ పెళ్లి విషయం మరిచిపోయిన వరుడు
వధువు ఏం చేసిందంటే….
వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో మరుపురాని అనుభూతి. కానీ కొన్ని పెళ్లిళ్లు పీటల దాకా వచ్చి ఆగిపోతుంటాయి. ఈమధ్య రకరకాల కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. అనుకోకుండా వేరేవారితో కూడా జరిగిపోతున్నాయి. కొన్ని కారణాలు కూడా విచిత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని మల్కాపూర్ గ్రామంలో జరిగింది. పెళ్లి సమయానికి వధువు, వరుడు పెళ్లిమండపానికి వచ్చినా, వరుడు తన స్నేహితులతో డాన్స్ చేసుకుంటూ ముహూర్త సమయం దాటించేశాడు.

గంటల కొద్దీ వేచి ఉన్న పెళ్లికూతురికి చిర్రెత్తుకొచ్చింది. అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీనితో తల్లి దండ్రుల కోరిక మేరకు, వివాహం చూడడానికి వచ్చిన తన స్నేహితుడినే వివాహం చేసుకుంది. వరుడి పక్షం పెద్దలు ఎంత నచ్చజెప్పినా అంగీకరించలేదు. నిజానికి ఈ సమయంలో పెళ్లికొడుకు బాగా మద్యం సేవించి ఉన్నాడని, పెళ్లి విషయం మరిచిపోయి చిందులు తొక్కుతూ డాన్సులు చేసాడని తెలిసింది.

