గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ప్రియులకు శుభవార్త. సోమవారం రోజు (28/10/2024) న గోెల్డ్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం నాడు 80,290 రూపాయలు ఉండగా సోమవారం 79,800 రూపాయలుగా ఉంది. అంటే.. బంగారం ధర ఏకంగా 490 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఆదివారం 73,600 ఉండగా, సోమవారం 73,150 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 450 రూపాయలు తగ్గింది.