సూర్య, చంద్రులపై శ్రీవారి వైభవం
తిరుమల: కలియుగదైవం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా మంగళవారం వేంకటేశ్వరుడు సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు కనువిందు చేశారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేసిన శ్రీవారు రాత్రి వేళ చల్లగా.. చంద్రప్రభ వాహనంపై మాడవీధులలో ఊరేగారు. మధ్యాహ్నం ఒంటిగంటకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్దంగా జరిగింది. శ్రీనివాసుని వాహనసేవల దర్శనానికి భారీగా భక్తులు మాడవీధులలో తరలివచ్చారు.