కేసుల సుడిగుండాల్లో చిక్కుకుంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడుడొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో చిక్కుకుంటూ..నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.అయితే తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. కొన్నాళ్లుగా డొనాల్డ్ ట్రంప్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనపై నేరాభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్‌కు మరో కేసులో షాక్ తగిలింది. ఆయనపై 2020లో అమెరికా అధ్యక్ష ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని నేరాభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని అధికారులను వాషింగ్టన్ స్పెషల్ కౌన్సిల్ ఆదేశించింది. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ఈ గురువారం కోర్టు ముందు హాజరుకావాల్సివుంది.