అంతర్వేది ఆలయం వద్దకు కొట్టుకొచ్చిన చేపలు..రోడ్డుపైనే జాలర్లు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో నదులు, చెరువులు పొంగి పొరలుతున్నాయి. దీనితో ఆ నదుల నుండి చేపలు రోడ్ల మీదకి కొట్టుకువస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద కుప్పలు కుప్పలుగా చేపలు కొట్టుకువచ్చాయి. కోనసీమ జిల్లావ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే సఖినేటిపల్లి మండల వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అంతర్వేది చుట్టు పక్కల ఉన్న చెరువులు నిండి.. వాగులు, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. వీటిని చూసిన స్థానికులు అక్కడికి వలలు, చీరలతో వచ్చారు. రోడ్డు మీదే చేపలు పట్టడం మొదలు పెట్టారు.

