Home Page SliderNational

“సరిపోదా శనివారం” నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “సరిపోదా శనివారం”.కాగా ఈ సినిమా నుంచి ఇవాళ ఫస్ట్ సింగిల్  “గరం గరం” సాంగ్‌ను మేకర్స్  విడుదల చేశారు. కాగా ఈ పాన్ ఇండియా సినిమాలో నాని సూర్య పాత్రలో కన్పించబోతున్నారు. అయితే ఈ సినిమాలోని సూర్య పాత్రలో మునుపెన్నడు చూడని ఓ ఇంటెన్స్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ని నానిలో ప్రేక్షకులు చూడబోతున్నారని దర్శకుడు వివేక్ ఆత్రేయ తెలిపారు. కాగా ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతంలో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి ఈ హిట్ జంట మ్యాజిక్ ఈ సినిమాలో ఫలిస్తుందో లేదో చూడాలంటే ఆగస్టు 29 వరకు వేచి చూడాల్సిందే.