మహిళల టీ 20 మొదటి ప్రత్యర్థి పాకిస్తానే.
పాకిస్థాన్ టీమిండియా పోటీని మరోసారి చూడబోతున్నారు. భారత జట్టు 2026 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలయిన సంగతి తెలిసిందే. భారత్ కి తొలి ప్రత్యర్థిగా పాకిస్తాన్ టీమ్ రావడం విశేషం. పాక్ పై పోరులో భారత్ టైటిల్ వేటను ఆరంభించనుంది. జూన్ 14, 2026న ఎడ్జ్ బాస్టన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ, ఆతిథ్య ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం టోర్నీ షెడ్యూలును ప్రకటించాయి. ప్రపంచకప్ లో 12 జట్లు పోటీపడతాయి. 24 రోజుల పాటు సాగే ఈ టోర్నీ వచ్చే ఏడాది జూన్ 12న ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్ ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ లో ఏడు వేదికల్లో ఆడతారు. ఎడ్జ్ బాస్టన్ తో పాటు హాంప్ షైర్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ ప్రపంచకప్ వేదికలు. జూన్ 30, జులై 2వ తేదీల్లో సెమీ ఫైనల్స్, జులై 5న లార్డ్స్ ఫైనల్ జరుగుతాయి.
రెండు గ్రూపులు: 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్, పాకిస్థాన్, రెండు క్వాలిఫయింగ్ జట్లు.. గ్రూప్-2లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఇంగ్లాండ్, రెండు క్వాలిఫయింగ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. పాకిస్థాన్ పోరు తర్వాత భారత మహిళల జట్టు. జూన్ 17, జూన్ 21, జూన్ 25, జూన్ 28వ తేదీల్లో మ్యాచ్ లు ఆడుతుంది

