Breaking NewsHome Page SliderInternationalNews Alert

లాస్ ఏంజెల్స్‌ను బుగ్గి చేస్తున్న కార్చిచ్చు..ఆస్కార్ వేదికకూ ప్రమాదం

హాలీవుడ్ సినీ ప్రముఖులు నివసించే విలాసవంతమైన లాస్ ఏంజెల్స్ నగరం కాలి బుగ్గవుతోంది. హాలీవుడ్ హిల్స్‌ను కూడా చుట్టుముట్టిన సన్‌సెట్ ఫైర్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకూ మొత్తం ఆరుచోట్ల కార్చిచ్చులు వ్యాపించినట్లు అధికారులు ప్రకటించారు. తాజాగా ఆస్కార్ అవార్డులు ప్రధానం చేసే ప్రఖ్యాత డాల్బీ థియేటర్‌ను కూడా అక్కడి అగ్నిమాపక శాఖ ఖాళీ చేయించింది. ఈ వేదికకు కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, అక్కడ కొత్త కార్చిచ్చు పుట్టిందని అధికారులు ప్రకటించారు. దీనితో హాలీవుడ్ హిల్స్‌ను ఖాళీ చేయించారు. అనేకమంది సినీతారలు, సెలబ్రెటీలు ఇళ్లు, సంపదలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 1200 నివాసాలు దగ్ధమయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకటిన్నర లక్షల మంది ఇళ్లు ఖాళీ చేశారు. ఇప్పటి వరకూ 50 బిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4.2 లక్షల కోట్ల సంపద కాలిబూడిదయ్యింది. దీనితో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన ఇటలీ, రోమ్ పర్యటనలు రద్దు చేసుకుని లాస్ ఏంజెల్స్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ ఇక్కడి కార్చిచ్చు భయంకర దృశ్యాలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.