జమిలి బిల్లుకు రంగం సిద్దం
ఈ నెల 16న జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది.దీన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ప్రవేశపెట్టనున్నారు.129వ రాజ్యంగ సవరణ కింద జమిలి బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురాన్నున్నారు.దీని కోసం 4 సవరణలు చేయనున్నారు. తర్వాత జాయింట్ యాక్షన్ పార్లమెంటరీకి పంపుతారు( ఎన్టీయే అవసరం మేరకు).బిల్లుపై చర్చించేందుకు దాదాపు 4 రోజులు కేటాయించనున్నారు.మొత్తం మీద బీజెపి మానస పుత్రికగా భావిస్తున్న జమిలి బిల్లుకు అన్నీ మంచి శకునములే అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నాయి. ఇది గనుక కార్యరూపం దాల్చితే ఇక 2027లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది.