News Alert

చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగింది

చాలా కాలం తర్వాత ఒక చక్కని సినిమాను చూసిన అనుభూతి కలిగిందన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తాజాగా వెంకయ్యనాయుడు `సీతారామం’ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన `సీతారామం’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వనీదత్‌తోపాటు ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. నటీ నటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమయిందని కొనియాడారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుడి నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించారన్నారు.  ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినదని వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ ద్వారా చెప్పారు.