అప్పుల బాధలు తాళలేక కుటుంబం ఆత్మహత్య
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.వరంగల్ జిల్లా తాండూర్ మండలం కాశిపేటకు చెందిన మొండియ్య(60) కుటుంబం గత కొన్నేళ్లుగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతుంది.పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం,సరైన ఉపాధి లభించకపోవడంతో చేసిన అప్పులు ఉరితాడులా మారాయి.నిత్యం అప్పుల వాళ్లు వేధించసాగారు.దీంతో గత్యంతరం లేక ఏకంగా కుటుంబం అంతా ఆత్మహత్యకు పాల్పడింది. భార్య శ్రీదేవి(50), కుమార్తె చిట్టి(25),కుమారుడు శివ ప్రసాద్ లు ఆత్మహత్య చేసుకున్నారు.స్థానికులు గమనించి 108కి సమాచారం అందించారు.అయితే మొండియ్య,శ్రీదేవి,చిట్టి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.కాగా శివప్రసాద్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.