కుంకీ ఏనుగులు వచ్చేశాయి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు బెంగళూరు నుండి 6 కుంకీ ఏనుగులను ఏపీకి పంపించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో పవన్‌కళ్యాణ్‌కు వీటిని అందజేశారు. నేడు చిత్తూరు జిల్లాకు ఈ కుంకీ ఏనుగులు లారీలలో చేరుకున్నాయి. వీటిలో రెండు ఏనుగులు తిరుపతి జూ పార్కుకు, 4 ఏనుగులు పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌కు పంపించారు.