NewsNews AlertTelangana

పేషెంట్‌కు సినిమా చూపిస్తూ సర్జరీ..

సాధారణంగా ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ముందుగానే పేషెంట్‌ భయపడకుండా ఉండటానికి కౌన్సిలింగ్ ఇస్తూంటారు. ఆపరేషన్ తో రోగి ఆరోగ్యం మెరుగుపడుతుందని ముందుగానే ప్రిపేర్ చేస్తారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన ప్రక్రియతో పేషెంట్‌కి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి  ప్రాణాలను కాపాడారు.. సృహలో ఉన్న పేషెంట్‌కి సినిమా చూపిస్తూ మెదడులోని కణితిని తొలగించి వైద్యులు భళా అనిపించుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి జిల్లాకు చెందిన వృద్ధురాలు(60) ఇటీవల అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. న్యూరాలజిస్టులు అతనికి పరీక్షలు నిర్వహించి మెదడులో ట్యూమర్ (ట్యూమర్) ప్రమాదకరంగా పెరుగుతోందని గుర్తించారు. వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులుకు తెలిపారు. ఆపరేషన్‌లో రోగి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని భావించి న్యూరోసర్జరీ, అనస్థీషియా వైద్యులు కలిసి మెలకువగా క్రానియోటమీ ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు.

ఆందోళన చెందిన వైద్యులు మరియు నర్సింగ్ సిబ్బంది గురువారం ఉదయం ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం ఆపరేషన్ గదిలోని టేబుల్‌పైకి తీసుకొచ్చి మత్తు మందు ఇచ్చారు. మెదడు ఎగువ భాగాన్ని తెరవడానికి ఆపరేషన్ సమయంలో, మూర్ఛలు, పక్షవాతంతో సహా వివిధ సమస్యలు వస్తాయని స్పృహలో ఉన్న ఆమెతో  నిరంతరం మాట్లాడుతూ యాక్టివ్‌గా ఉంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు చిరంజీవి, నాగార్జున అంటే చాలా ఇష్టమన్నారు. చిరంజీవి నటించిన అడవిదొంగ సినిమాని కంప్యూటర్ ట్యాబ్‌లో ఆమెకు ఇష్టమైన సినిమాను చూపించారు. ఆమె సినిమా చూస్తుండగానే వైద్యులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మెదడులోని మిగిలిన భాగాలకు ఎలాంటి హాని కలగకుండా కణితిని తొలగించారు. ఈ రకమైన ఆపరేషన్‌ను వైద్యపరంగా అవేక్ క్రానియోటమీ అంటారు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజారావు, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డా. ప్రకాశరావు, అనస్థీషియాలజిస్ట్ ప్రొఫెసర్ శ్రీదేవి ఈ విషయాన్ని తెలియజేసారు..