Home Page SliderTelangana

కుర్చీల వివాదం.. ఓ నిండు ప్రాణం బలి..

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓల్డ్‌సిటీలో చిన్న వివాదం ఒకరి ప్రాణం తీసింది. హఫీజ్‌బాబా నగర్‌లోని సీ-బ్లాక్‌లో జాకీర్ ఖాన్(62) కిరాణా దుకాణం నడుపుతున్నారు. జకీర్ షాపు ముందు ఆ పక్కనే ఉన్న పాన్‌షాపు యజమాని కుర్చీలు వేయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జాకీర్‌పై పాన్‌షాపు యజమానులు దాడికి పాల్పడ్డారు. దీంతో జాకీర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.