అమెరికా నిఘా సంస్థ డైరెక్టర్.. భారత సంతతి వ్యక్తి
భారత సంతతికి చందిన వ్యక్తి తులసీ గబ్బార్డ్ ను తమ దేశ నిఘా సంస్థ డైరెక్టర్ అమెరికా అధికారికంగా నియమించింది. తాజాగా జరిగిన సెనేట్ ఓటింగ్ లో ఆమెకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయి. డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అక్కడ ఉన్న 18 నిఘా సంస్థల కార్యకలాపాలను తులసి పర్యవేక్షిస్తారు. కీలక సమస్యలపై ట్రంప్ కు సలహాదారుగా వ్యవహరిస్తారు.అమెరికా పై 2001లో ఉగ్రదాడుల అనంతరం ఈ పదవిని ఏర్పాటు చేశారు.ఇలాంటి ఉన్నత పదవి భారత సంతతకి చెందిన వ్యక్తి దక్కడంతో అక్కడ భారతీయుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

