crimeHome Page Slidertelangana,

కొంపముంచిన నర్సుల డాన్స్..

జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల డాన్స్ వీడియోలు వారి కొంప ముంచాయి. వీరు రోగులను పట్టించుకోకుండా, డ్యూటీ పక్కన పెట్టి వీడియోలు, డాన్సులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రిస్మస్ వేడుకల కోసం వీరు కోలాటం, డాన్స్ రిహార్సల్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. పేషంట్లను పక్క రూములో ఉంచి, వీరిలా నృత్యాలు చేయడంతో అడిషనల్ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు. అక్కడి రీజనల్ మెడికల్ ఆఫీసర్ వీరి అభ్యర్థన మేరకు డాన్స్‌కు పర్మిషన్ ఇచ్చారని సమాచారం. దీనితో వీరందరిపై విచారణకు ఆదేశించారు.