సీఎం ప్లేటు భోజనం ఖర్చు రూ.32 వేలు
ఇటీవల వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మంది వందిమాగధులకు తాజ్ కృష్ణ నుంచి భోజనాలు తెప్పించారట.ఇప్పుడా బిల్లు చెల్లించాలని ఆలయానికే నేరుగా భోజనం బిల్లులు పంపారు.ఇంతకీ ఆ బిల్లులు ఆలయ ఈవోకి పంపిందెవరో తెలుసా.. రాజన్న సిరిసిల్లా జిల్లా కు చెందిన ఉన్నతాధికారే.దీంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.ప్లేట్‌కు రూ.32వేలంటే 100 మందికి రూ.32లక్షలు ఈ మొత్తాన్ని ఆలయం ఎందుకు చెల్లిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు.భోజన బిల్లు కాకుండా ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.1 కోటి 70 లక్షలకు పైనే ఖర్చు చేశారు.దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఖజనాకు తూట్లు పొడిచేలా సభలు నిర్వహించకపోతే ఏమైంది రేవంత్ అంటూ బీఆర్ ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.ఈ బిల్లు వ్యవహారం జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరడంతో ఈ భాగోతం బట్టబయలైంది.