భారత్‌పై మళ్లీ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లో దాదాపు 5 నెలల తరువాత కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలోనే భారత్‌లో 1300 వందల కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో 3గ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Read more: 2050 నాటికి భారత్‌కు పొంచివున్న ముప్పు

