Home Page SliderTelangana

రెచ్చిపోవద్దు.. కాంగ్రెస్ శాశ్వతం కాదు

కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చడం తప్ప పూడ్చటం రాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా గండి పూడ్చడానికి 22 రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో ఖమ్మం జిల్లా నేతలతో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ గండి పూడ్చకపోవడం వల్ల ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదల్లో పంట నష్టపోయిన రైతులతో సమానంగా.. పంట ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల గోస ప్రభుత్వానికి కనిపిస్తే లేదా అని ప్రశ్నించారు. తమపై దాడి చేసిన వారిపై ఇంకా కేసులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని.. అధికారులు రెచ్చిపోవద్దన్నారు. అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అధికారులకు ఏపీలో పట్టిన గతే పడుతుందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.