BusinessHome Page SliderNationalNews Alertviral

రిజక్ట్ అయిన కంపెనీకే కంపెనీ హెడ్ గా

రాగిణి దాస్ ను సక్సెస్ క్వీన్ గా చెప్పుకోవచ్చు. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఇంటర్యూకి వెళ్లి, రిజెక్ట్ అయిన ఆమె తొందరలోనే మళ్లీ అదే గూగుల్ కంపెనీకి  గూగుల్ ఫర్ స్టార్ట్ అప్స్ ఇండియా హెడ్ గా నియమితురాలయ్యింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ లైఫ్ సర్కిల్ లా తిరుగుతోందని వ్యాఖ్యానించింది. FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న రాగిణి దాస్ ఇప్పుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్ గా ఎంపికైంది. ఆమె 2013లో గూగుల్ లో ఉద్యోగం కోసం చివరి రౌండ్ ఇంటర్యూలో  సెలక్ట్ కాలేకపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈమె స్టోరీ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గురుగ్రామ్ కు చెందిన రాగిణి చెన్నైలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పొందింది. డిగ్రీ చదువుతున్న సమయంలోనే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి సంస్థలలో ఇంటర్న్ గా పని చేస్తూ మార్కెట్ పరిశోధన కోసం వ్యాపార ప్రణాళికలు తయారు చేసింది. 2012లో దేశీయ మార్కెటింగ్ కోసం ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో పనిచేసి, అనంతరం యూరప్ అండ్ యూఎస్ మార్కెటింగ్ నిర్వహణలో ప్రమోషన్స్ పొందింది. అనంతరం జొమాటోలో చేరి సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఆరేళ్ల పాటు పని చేసింది. ఈ సమయంలో 10 అంతర్జాతీయ మార్కెట్లలో జొమాటో గోల్డ్ ను ప్రారంభించింది. 2020 లో మహిళల కోసం ఆన్ లైన్ ఆఫ్ లైన్ క్లబ్ leap.club స్థాపించి మహిళలకు నెట్ వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు కల్పించింది. ప్రస్తుతం ఆమె భారత్ గూగుల్ ఫర్ స్టార్టప్  విభాగానికి కొత్త హెడ్ గా నియమించబడడంతో ఆమె కథ వైరల్ అవుతోంది.