టికెట్ల పెంపుకే సీఎం అవసరం…విషెస్‌కి మాత్రం నో
సినీ నిర్మాత,తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా సినీ ప్రముఖులపై వ్యంగాస్త్రాలు విసిరారు. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన వారందరికీ ధన్యవవాదాలని,ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా తీరిక లేని ప్రముఖులకు నమస్కారాలంటూ ఎద్దేవా చేశారు.సీఎం అంటే మన సినిమాల టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అవసరమయ్యే వ్యక్తిగానే చూస్తున్నామని, కానీ పుట్టిన రోజు నాడు విషెస్ చెప్పాలన్న నైతిక స్పృహ లేదన్నట్లూ విమర్శనాస్త్రాలు విసిరారు.దీంతో ఫిల్మ్ నగర్‌లో ఈ ట్వీట్ పెద్ద టాపిక్ అయ్యింది.

