నగరం మారాలి.. పచ్చని మొక్కలతో వనమల్లె తీర్చిదిద్దాలి
మహానగర వ్యాప్తంగా పచ్చదనం పరవళ్లు తొక్కేలా ప్రభుత్వం ప్లాన్లు రూపొందిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్థానంలో వజ్రోత్సవ వన మహోత్సవం పేరుతో కొత్త కార్యక్రమానికి వచ్చే నెల ఒకటో తేదీ నుండి శ్రీకారం చుట్టనుంది. హెచ్‌ఎండిఎ ఇప్పుడు 7 జిల్లాలు.. 7200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఆయా ప్రాంతాల్లో పచ్చదనం కోసం ప్రత్యేక ప్రణాళికను హెచ్ఎండీఎ పరిధిలోని పట్టణ అటవీ విభాగం చేపట్టింది. ఇందుకు ప్రభుత్వం నుండి రూ.381 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా 4 కోట్ల మొక్కలు నాటనున్నారు. నలభై నర్సరీల ద్వారా 165 రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిలో 40 రకాల వరకు పండ్ల జాతులకు చెందినవే.

