Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

మొబైల్ ఇవ్వ‌లేద‌ని త‌ల్లిపై క‌త్తితో దాడి చేసి పిల్లాడు

ఫ్రీ ఫైర్ గేమ్స్ వ‌ల్ల పిల్ల‌ల మాన‌సిక స్థితి గ‌తి త‌ప్పుతుంద‌ని ఎంత‌గా మొత్తుకుంటున్నా పేరెంట్స్ మాత్రం వినే ప‌రిస్థితుల్లో లేదు.య‌ద్భావం త‌ద్భ‌వ‌తి అన్న‌ట్లుగా ముద్దుముద్దుగా ఉన్నార‌ని మొబైల్స్ ఇచ్చి గారాబం చేసిన పాపానికి క‌న్న వాళ్ల‌పైనే పిల్ల‌లు క‌త్తులు నూరుతున్నారు.ఇందుకు క‌దిరిలో ఓ ఘ‌ట‌న సాక్షీభూతంగా నిలిచింది. కదిరిలో ఓ పిల్లోడు ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్న సమయంలో ఫోన్లో డేటా అయిపోయింది.ఇంటి ప‌నుల్లో ఉన్న తల్లిని ఫోన్ అడగగా, ఆమె విసిగించుకుని ఫోన్ ఇవ్వ‌లేదు.దీంతో తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కత్తితో గొంతుపై దాడి చేశాడు.మొహానికి తీవ్ర గాయమైన తల్లిని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘ‌ట‌న క‌దిరిలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది