ఆ అధికారులకు దూరంగా ముఖ్యమంత్రి పరిపాలన!
ఆంధ్రప్రదేశ్: అధికారుల బదిలీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న అధికారులను దూరం పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి ప్రక్షాళన జరగాలని సీబీఎన్ భావన.

