ప్రచారంలో డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
తొలి విడత ఎన్నికల తేదీ దగ్గర పడడంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అసోంలో కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆకౌ ఏక్‌బార్ మోడీ సర్కార్ అనే బీజేపీ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు.

