Home Page SliderTelangana

నేడు అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్: అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుండి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి.. ప్రభుత్వ ప్రాధాన్యతలను ముఖ్యమంత్రి వివరించనున్నట్లు తెలుస్తోంది.