తెలంగాణపై కేంద్రం పగబట్టింది… మరోసారి కేటీఆర్ గరంగరం..
Minister KTR
తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఓ శత్రు రాష్ట్రంగా చూస్తుందన్నారు. తెలంగాణలోని గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇస్తుందన్నారు. అయితే.. 1200 కోట్ల ఉపాధి హామి నిధులను కేంద్రం నొక్కిపెండుతోందని ధ్వజమెత్తారు. దేశంలోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా మారాయన్నారు. సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్గా నిలవడం గొప్ప విషయమని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ పురస్కారాలు వస్తున్నాయన్నారు. అనేక గ్రామాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయన్నారు.

