నీట్ పరీక్షను రద్దు చేయలేమన్న కేంద్రం
దేశంలోని లక్షలాది మంది విద్యార్థులు కళ “నీట్” ఎగ్జామ్. అలాంటి ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్‌లో ఈ ఏడాది అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా ఉన్న నీట్ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు వారంతా నీట్ ఎగ్జామ్‌ను తక్షణమే రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే కేంద్రం నీట్ పరీక్షలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది.ఈ మేరకు దీనిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. కాగా ఈ అఫిడవిట్‌లో నీట్ ఎగ్జామ్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అలా రద్దు చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన ఎన్నో లక్షలమంది విద్యార్థులకు నష్టం కలుగుతుందని పేర్కొంది. అయితే పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది.కాగా నీట్ నిందితులను కూడా అరెస్ట్ చేసి..దర్యాప్తుకు ఆదేశించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

