InternationalNewsNews Alert

పాక్‌ ఓటమికి కారణం..బ్యాట్స్‌మెన్సే – బాబర్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు తెరపడింది. 5 వికెట్ల తేడాతో పాక్ పై భారత్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో కొన్ని ఒడిదుడుకుల కారణంగానే తాము మ్యాచ్ ఓడి పోయునట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అన్నాడు. బౌలర్ల పరంగా ఎటువంటి అభ్యంతరాలు లేవని , బ్యౌటింగ్‌లో మరికొన్ని పరుగులు తీసుంటే తప్పక విజయం సాధించేవారమని పేర్కొన్నాడు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయాల్సివచ్చిందని, కొన్ని ఎత్తుగడలు వేసామని, కానీ అవి ఫలించలేదని స్పష్టం చేశాడు. అందులో భాగంగానే నవాజ్‌కు చివరి వరకు బ్యాటింగ్ ఇవ్వలేదన్నాడు. కానీ హర్దిక్ పాండ్యా మాత్రం మ్యాచ్‌లో అదరగొట్టాడని తెలిపాడు.