చెరువులోకి దూసుకెళ్లిన కారు
యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. జలాల్‌పూర్ చెరువులోకి అదుపు తప్పి కారు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. మృతులంతా హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతులు వంశీగౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్ వీరంతా హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. మణికంఠ అనే వ్యక్తి ఒక్కడే మృత్యుంజయుడుగా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను చెరువు నుంచి వెలికి తీయించారు. కాగా ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.