Home Page SliderNational

కాంగ్రెస్, ఎస్పీ మధ్య కుదిరిన పొత్తు లెక్కలు… యూపీలో ఈసారి బీజేపీకి టఫ్ఫేనా?

Share with

యూపీలో పొత్తు పొడొస్తోంది. ఇప్పటి వరకు పొత్తు ఏమవుతుందోనన్న ఊగిసలాట నడము రెండు పార్టీలు ఒక క్లారిటీకి వచ్చాయ్. పొత్తు లేకుంటే ఎన్నికల్లో గెలుపు కష్టమన్న భావనలో ఉన్న రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయ్. గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో దారుణంగా ఓడిపోయిన రెండు పార్టీలు ఈసారి పొత్తుతో బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తున్నాయ్. “అంతా బాగానే ముగుస్తుంది. అవును, పొత్తు ఉంటుంది.. ఎలాంటి విభేదాలు లేవు. త్వరలోనే అంతా తేలిపోతుంది” అని నవ్వుతూ అఖిలేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అవినాష్ పాండేతో మాట్లాడుతూ, “మేము కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నాం… కూటమి ప్రయోజనాల దృష్ట్యా కొన్ని సీట్లను మార్చడానికి మేము అంగీకరించాము.” అని చెప్పారు.

తాజా పొత్తు ప్రకారం యాదవ్ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేస్తుందని, కాంగ్రెస్‌కు 17 రిజర్వ్ చేస్తారని, ఒక సీటును చంద్రశేఖర్ ఆజాద్ ఆజాద్ సమాజ్ పార్టీకి కేటాయిస్తారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎస్టీ హసన్‌ గెలుపొందిన మొరాదాబాద్‌ను వదులుకునేందుకు కాంగ్రెస్‌ 19ని కోరింది. ప్రతిగా ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిపై సమాజ్‌వాదీ పార్టీ తన డిమాండ్‌ను ఉపసంహరించుకుంటుంది. ఇద్దరూ సీతాపూర్, హత్రాస్‌లను కూడా మార్చుకోవచ్చు. సమాజ్‌వాదీ పార్టీకి శ్రావస్తికి బదులుగా బులంద్‌షహర్ లేదా మధుర ఆఫర్ చేశారు. మొత్తం వ్యవహారంపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సోనియా గాంధీ ఖాళీ చేసిన రాయ్‌బరేలీ స్థానం నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ తన అరంగేట్రం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా గాంధీ – లోక్‌సభ నుండి రాజ్యసభకు మారడం పార్టీలో నాయకత్వ మార్పు గురించి చర్చకు దారితీసింది. ప్రియాంకకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ – కూడా కీలక పాత్ర పోషించింది. పొత్తుపై సోనియాగాంధీతో మాట్లాడి, అఖిలేష్ ను ఒప్పించడంలో ప్రియాంక పాత్ర ముఖ్యమని చెప్పాలి. అలాగే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాల్లో విజయం సాధించింది. గత ఏడాది జూన్‌లో ఇండియా కూటమి ఏర్పాటైన నాటి నుంచి పొత్తు లెక్కలు తేలడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ బాస్ నితీష్ కుమార్ నిష్క్రమణను చూసింది.

యూపీలో జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్‌ను కూడా కోల్పోవడం దాదాపు ఖాయమనిపిస్తోంది. బెంగాల్‌లో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్‌కు చెందిన అధిర్ రంజన్ చౌదరి నిరంతర విమర్శల తర్వాత, రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు సొంతంగా పోటీ చేయాలని యోచిస్తోంది. పంజాబ్‌లో గత ఎన్నికల్లో ఆప్‌ చేతిలో కాంగ్రెస్‌ ఓటమి చవిచూసింది. సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీలకు క్లారిటీ మిస్సవుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బల తర్వాత యూపీలో పొత్తు లెక్కలు తేలాయి. కాంగ్రెస్-ఆప్ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూటమికి ఇది శుభసూచికమని చెప్పాలి. మేయర్ ఎన్నిక గెలుపు సానుకూల ప్రభావం చూపుతుందనేది ఆశాభావం కలుగుతోంది. దీంతో యూపీలో యోగి సర్కారుకు ఇప్పుటు కూటమి దెబ్బ తగిలే అవకాశం కన్పిస్తోంది. రామమందిర నిర్మాణం తర్వాత భారీగా సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పొత్తు ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి.