ప్రేమ మత్తులో కన్నతల్లిని కడతేర్చిన కసాయి కూతురు
హైదరాబాద్ జీడిమెట్లలో ఒక హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఓ బాలిక, తన ప్రేమకు అడ్డుగా ఉండని కన్నా తల్లినే ప్రియుడితో కలిసి హతమార్చిన ఘటన సంచలనం అయ్యింది…ప్రియుడు శివ మరియు అతనీ సోదరుడు యశ్వంత్ తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ కసాయి కూతురు…పోలీసుల కథనం ప్రకారం, బాలిక స్థానికంగా 10 తరగతి చదువుకుంటుంది… ఆ క్రమంలో శివ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారి, తరచూ కలిసి తిరుగుతుండడంతో ఇది తల్లి దృష్టికి వచ్చింది. ఆమె చదువుపై దృష్టి పెట్టాలని, ప్రేమకు ఇది సరైన వయస్సు కాదని మందలించడంతో బాలిక తల్లిపై పగ పెంచుకుంది.తల్లిని చంపాలనే ఆలోచనతో శివ కు విషయం చెప్పగా, అతడు తమ్ముడు యశ్వంత్‌ను కూడా కలుపుకుని స్కెచ్ వేశారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ముగ్గురూ కలిసి ఆమెపై దాడి చేశారు. మొదట గొంతు నులిమి, అనంతరం ఇనుప రాడ్తో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. హత్య అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.