మైసూర్ పాక్ పేరు మార్చిన వ్యాపారి..
జైపూర్‌లోని ఒక స్వీట్ షాప్ వ్యాపారి మైసూర్ పాక్ పేరును మార్చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై పలు ఆంక్షలకు దిగింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన అనంతరం పాకిస్తాన్ పేరును సూచించే కరాచీ బేకరీ, మైసూర్ పాక్ వంటి పేర్లలో మార్పులు చేయాలని పలువురు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. దీనితో జైపూర్‌లోని త్యోహార్ స్వీట్స్ యజమాని తమ షాపులో గల స్వీట్ల పేర్లలో మార్పులు చేశారు. మైసూర్ పాక్‌కు మైసూర్ శ్రీ అని, మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ పేర్లను పాక్ తీసివేసి, శ్రీ అని చేర్చారు. దేశభక్తి సరిహద్దుల్లోనే కాదు, మనస్సులో కూడా ఉండాలి. అందుకే ఈ పేర్లు మార్చాం అని పేర్కొన్నారు. అసలు పాక్ అంటే సంస్కృతంలో బెల్లం లేదా చక్కెరతో చేసి పాకం అని అర్థం.