అధికారం కోసమే బీజేపీ రాముడిని వాడుకుంటోంది..
శ్రీరాముడు బీజేపీకి మాత్రమే దేవుడు కాదని.. విశ్వసించే వారందరికీ శ్రీరాముడు దేవుడేనన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా. బీజేపీ తన మైండ్ సెట్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులమని చెప్పుకునే వారికి ప్రేమ ఉండదని ఫరూక్ విమర్శించారు. శ్రీరాముడిని బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. ఉధంపూర్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తామే రాముడి భక్తులమని చెప్పుకునే వారికి నిజంగా రాముడిపై ఎలాంటి ప్రేమ ఉండదని.. అధికారం కోసమే వారలా చెబుతారని ఫరూక్ విమర్శలు గుప్పించారు.