ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని గోల్డెన్ సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడి (7) తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి మీరాలం ట్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. బాలుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి వుంది.