పేదలకు గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం సరికొత్త పధకంతో పేదలకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ప్రతీనెలా ఒకటో తేదీన పేదల సేవలో అనే కార్యక్రమం అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ప్రజల కష్టాలు తెలుసుకుని పేదరికం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి అక్టోబరు 2న ఏపీలో విజన్ 2017 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఈ 100 రోజులు టార్గెట్ పెట్టుకుని పనులు చేస్తున్నామన్నారు. తాను ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని, తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.


 
							 
							