NationalNewsNews Alert

భారత మహిళల సాహస యాత్ర..భూమిని చుట్టి వచ్చిన త్రివేణి

త్రివిధదళాలకు చెందిన 12 మంది అధికారిణుల బృందం చేసిన సాహసయాత్ర విజయవంతంగా పూర్తయ్యింది. భారత నారీ శక్తినీ, సముద్ర జలాలపై మనకున్న బలాన్నీ చాటి చెప్పేందుకు ఈ యాత్రను సంకల్పించారు. ఈ మొట్టమొదటి అంతర్జాతీయ ఓపెన్ సీ సెయిలింగ్ మిషన్ ఏప్రిల్ 7న ముంబయిలో ప్రారంభమైంది. ఆఫ్రికాలోని సీషెల్ష్‌కు చేరి తిరిగి ముంబయికి చేరుకోవడంతో ఈ ప్రదక్షిణ పూర్తయ్యింది. దేశీయంగా నిర్మించిన భారత సశస్త్ర దళాల నౌక ‘త్రివేణి'(56అడుగుల సెయిలింగ్ యాట్)పై దాదాపు రెండు నెలల పాటు వీరి ప్రయాణం సాగింది. అత్యంత ప్రమాదకర జలాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాల మధ్య 1800 నాటికల్ మైళ్లు సముద్రయానం చేశారు. ఈ యాత్ర కేవలం సముద్రయానం కాదు… మహిళాసాధికారతకు శక్తిమంతమైన సూచికగా నిరూపించారు. సముద్రంలో భూమిని చుట్టి వచ్చిన మొట్టమొదటి మహిళా బృందంగా పేరు తెచ్చుకున్నారు.