రేవంత్ లత్కోర్ ప్రయత్నమే ఏసిబి కేసు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫార్ములా -ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసి ప్రపంచలో భారత్ పరువు,ప్రధానంగా బిబినెస్ స్టేట్ అయిన హైద్రాబాద్ పరువు మంటగొల్పినందుకు ఆయనపైనే కేసులు పెట్టాలని మాజీ మంత్రి కేటిఆర్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన గురువారం రాత్రి నుంచి సీఎంని తూర్పారబడుతూనే ఉన్నారు. కరెప్షనే లేనప్పుడు ఇక కేసు ఎక్కడిది, వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలి, రేవంత్ చేస్తున్న మరో లత్కోర్ పనే ఈ ఏసిబి కేసు అంటూ కేటిఆర్ మండిపడ్డారు. హైద్రాబాద్ ఇజ్జత్‌ని బ్రాండ్ ఇమేజ్ ని కాలరాస్తున్న రేవంత్‌పై ప్రజలు తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా వాటిని శాంతియుతంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.

