NewsTelangana

14వ రౌండ్‌ కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోనే..

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వరుస రౌండ్లలో ఆధిక్యం సాధిస్తోంది. 14వ రౌండ్‌లోనూ ఓట్ల ఆధిక్యతతో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6,612 ఓట్లు.. బీజేపీకి 5,557 ఓట్లు పడ్డాయి. దీంతో 14వ రౌండ్‌ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ 10,094 ఆధిక్యతతో తిరుగులేని విజయానికి చేరువగా నిలిచింది.