NewsTelangana

టీఆర్‌ఎస్‌ సంబురాలు షురూ.. 12వ రౌండ్‌లో భారీ ఆధిక్యత

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం ఖాయమైంది. 12వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 7440 ఓట్లు.. బీజేపీకి 5398 ఓట్లు లభించాయి. దీంతో ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2042 ఓట్ల ఆధిక్యత సాధించింది. 12వ రౌండ్‌ పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ 7836 ఓట్ల ఆధిక్యతతో ఎదురులేని విజయానికి చేరువగా ఉంది. టీఆర్‌ఎస్‌ శ్రేణులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌తో పాటు మునుగోడులోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. వామపక్షాల పొత్తుతోనే ఈ విజయం సాధ్యమైందని టీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఖాళీ అవుతోంది. కార్యకర్తల జాడే లేదు. నాయకులు కూడా ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు.