యాపిల్ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోకపోతే అంతే సంగతులు
యాపిల్ డివైజ్ లు వాడుతున్న యూజర్లు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పాత డివైజ్ లు వాడుతున్న వారు ఇమీడియేట్‌గా అప్ డేట్ చేసుకోవాలని కోరింది. లేనిపక్షంలో సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పువాటిల్లుతుందని హెచ్చరించింది.డేటా చోరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.పాత డివైజ్‌ల కోడ్ ని రీడ్ చేసే సైబర్ క్రైంగాళ్లు పెరిగిపోతున్నారని దీని వల్ల ఇబ్బందిపడతారని పేర్కొంది. కొత్త వర్షన్ అందుబాటులో ఉందని యూజర్లు ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయోద్దని సూచించింది.