మోదీ మాటంటే అంతే..శ్రీలంక ప్రభుత్వం ఏం చేసిందంటే..
ప్రధాని నరేంద్ర మోదీ మొన్ననే శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఇరు దేశాల నాయకులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ముచ్చటించిన ప్రధాని మోదీ సముద్ర సరిహద్దులను దాటి వచ్చిన భారతీయ మత్స్యకారుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని శ్రీలంక అధ్యక్షుని కోరారు. దీనితో వారు సానుకూలంగా స్పందించి మరుసటి రోజే 15 మంది భారతీయ జాలర్లను విడుదల చేశారు. వివిధ రంగాలలో ఇరు దేశాలు పరస్పర సహకారం అందించుకుంటామని అనేక ఒప్పందాలు చేసుకున్నాయి.

