ఆ మెసేజ్‌లు నమ్మారో అంతే..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు మోసపోవద్దని, కొన్ని రకాల మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించింది. పీఎం కిసాన్ యోజన, పీఎం ఆవాస్ యోజన పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌లను నమ్మి ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దని పేర్కొంది. ఈ పథకాల పేర్లతో నకిలీ ఎస్‌ఎంఎస్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఏపీకే ఫైల్స్ పంపి, దాని ద్వారా పథకంలో చేరాలని చెప్తే అలాంటి లింక్స్‌ను ఓపెన్ చేయవద్దని పేర్కొన్నారు. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. అనుమానాలు ఉంటే 1930కి టోల్‌ఫ్రీ నెంబర్‌కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.