సినిమా నుండి ఆ పాట తొలగింపు
డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమా యూనిట్ ఒక మెట్టు దిగింది. సినిమాలో నుంచి శ్రీనివాసా గోవిందా అనే ర్యాప్ సాంగ్ ను తొలగిస్తునట్లు చిత్ర బృందం ప్రకటించింది. స్వామివారి నామాలను కించపరిచేలా సినిమాలో పాట తొలగించాలంటూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో తమిళనాడులో ఈ సినిమా నిర్మాతపై కేసు నమోదు అయింది. నిర్మాతకు ఇటీవల టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. వివాదం తీవ్రం కావడంతో సినిమా నుంచి సాంగ్ ని తొలగిస్తునట్లు సినిమా యూనిట్ ప్రకటించింది.

