అందుకే కేబినెట్ విస్తరణ చేయడం లేదు..
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిను కాంగ్రెస్ అధిష్ఠానం నమ్మడం లేదని అన్నారు. అందుకే తెలంగాణ కేబినెట్ విస్తరణ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం మెప్పు కోసమే మోదీ, RSSపై సీఎం రేవంత్ విమర్శలు చేస్తున్నారని ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ సారి ఢిల్లీలో ఆప్‌కు ఓటమి తప్పదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ జోస్యం చెప్పారు.