నాగబాబుకు అందుకే మంత్రి పదవి
తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ అయ్యాకే వస్తుందన్నారు. మార్చి నెలలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని తర్వాత కేబినెట్‌లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. తన సోదరుడు అయినందువల్ల మంత్రి పదవి ఇవ్వడం లేదని, పార్టీలో బలంగా తనతో సమానంగా కష్టపడి నాగబాబు పనిచేశారని పేర్కొన్నారు. మొదట రాజ్యసభకు పంపిద్దామనుకున్నానని, కానీ కుదర్లేదని వివరించారు. కాపు సామాజిక వర్గానికి చెందకపోయినా పార్టీ కోసం పనిచేసిన వాళ్లకే అవకాశాలుంటాయని స్పష్టం చేశారు.